ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో 1,793 ట్రేడ్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్ పోస్టులు

by Disha Web Desk 17 |
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో 1,793 ట్రేడ్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్ పోస్టులు
X

దిశ, కెరీర్: సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ట్రేడ్స్ మ్యాన్ మేట్ - 1249

ఫైర్ మ్యాన్ - 544

మొత్తం పోస్టులు: 1,793

రీజియన్లు: ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్ రీజియన్.

అర్హతలు: ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు మెట్రిక్యులేషన్, ఐటీఐ.

ఫైర్ మ్యాన్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకు రూ. 18,000 నుంచి రూ. 56,900;

ఫైర్ మ్యాన్ ఖాళీలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 ఉంటుంది.

ఎంపిక: ఫిజికల్ ఎండ్యూరెన్స్ /స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా..

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: https://www.aocrecruitment.gov.in


Next Story

Most Viewed