నల్లమల అత్యాచారం కేసులో.. సంచలన విషయాలు వెలుగులోకి

by  |
rape-in-tirupathi
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతం అమ్రాబాద్ మండల పరిధిలోని పర్లపల్లి గ్రామానికి చెందిన మహిళ గత నెల 28న అత్యాచారానికి గురైన సంఘటన పై రాష్ట్ర, జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నిజనిర్ధారణ కోసం బాధితురాలు గ్రామస్తులతో మాట్లాడారు.ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. బాధిత మహిళ వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి ఇంటిలో అలసిపోయి సాయంత్రం మూడు గంటల సమయంలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన చిగుళ్ల మల్లయ్య అనే వ్యక్తి మృగం లాగా ప్రవర్తిస్తూ బాధితురాలిపై పిడి గుద్దులు గుద్దుతూ, ముఖంపై గాయాలు చేస్తూ, రకరకాలుగా హింసిస్తూ ఆ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు.

అలాగే రాత్రి 11 గంటల సమయంలో మరోసారి ఆ మహిళపై బలవంతంగా అత్యాచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయురాలైన ఆ మహిళకు గ్రామస్తులు సహాయం అందించలేకపోయారని, సర్పంచ్ కల్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి డిమాండ్ చేశారని తెలిపారు. ప్రభుత్వపరంగా బాధితురాలికి అన్యాయం జరిగిన తర్వాత జరపాల్సిన తంతును ముగించి మా పని అయిపోయిందని చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నివారించే చర్యలు మాత్రం లేవని నేరాలు జరగకుండా ఆగిపోయిన దాఖలాలు లేవని విమర్శించారు. మల్లయ్య జులాయిగా తాగుడుకు బానిసై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారని గ్రామంలో నాటు సారా ఏరులై పారుతుందని, దాన్ని నివారించే అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు…

బాధిత కుటుంబాన్ని కలెక్టర్ సందర్శించి బాధితురాలికి ఉద్యోగ భద్రత, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మానవీయ కోణంలో ఇప్పటివరకు అధికారులు ప్రజా ప్రతినిధులు పరామర్శించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు తెలుపుతున్న సమాచారం మేరకు గ్రామములో పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని అందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టేలా కలెక్టర్ దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బాలయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బాలయ్య, కార్యవర్గ సభ్యులు వెంకటేష్ సత్యం ఉన్నారు.

Next Story