వొడాఫోన్ ఐడియా కంటే మూడు రెట్లు వేగంగా జియో 4జీ నెట్‌వర్క్

by  |
వొడాఫోన్ ఐడియా కంటే మూడు రెట్లు వేగంగా జియో 4జీ నెట్‌వర్క్
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ వేగంలో మరోసారి రికార్డు నమోదు చేసింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. మే నెలకు సంబంధించి రిలయన్స్ జియో ఇతర నెట్‌వర్క్‌ల కంటే సెకనుకు 20.7 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. అప్‌లోడ్ వేగంలో వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ 6.7 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో ముందు వరుసలో నిలిచింది. రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ వేగం స్వల్పంగా మాత్రమే పెరిగింది. అయితే ఇది వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా డౌన్‌లోడ్ వేగం మే నెలలో 6.3 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు ట్రాయ్ తెలిపింది. అంతేకాకుండా, 2018, ఆగష్టులో వొడాఫోన్, ఐడియాలు విలీనం జరిగిన తర్వాత మొదటిసారిగా రెండు కంపెనీల నెట్‌వర్క్ వేగాన్ని కలిపి ప్రకటించారు. అప్‌లోడ్ వేగంలో వొడాఫోన్ తర్వాత రెండో స్థానంలో రిలయన్స్ జియో 4.2 ఎంబీపీఎస్ వేగం, భారతీ ఎయిర్‌టెల్ 3.6 ఎంబీపీస్ అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉన్నాయి. ఇక, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే 4జీ సేవలను ప్రారంభించింది. దీంతో బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ వేగాన్ని ట్రాయ్ వెల్లడించలేదు.

Next Story