వాటికి జియో ట్యాగింగ్ చేస్తాం : మేయర్

by  |
వాటికి జియో ట్యాగింగ్ చేస్తాం : మేయర్
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్ బొంతురామ్మోహన్ మంగళవారం వక్ఫ్‌‌బోర్డు ఛైర్మన్‌ మహ్మద్‌ సలీమ్‌తో భేటి అయ్యారు. ఇందులో జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని వక్ఫ్‌ బోర్డు ఆస్తులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని వక్ఫ్‌‌బోర్డు ఆస్తులకు జియోట్యాగింగ్‌ చేయలని సమావేశంలో నిర్ణయించినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రకటించారు. వక్ఫ్‌‌బోర్డు ఆస్తులను ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలతో అనుసంధానిస్తామని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ(SRDP) ప్రాజెక్టుల నిర్మాణం, లింక్‌ రోడ్ల అభివృద్ధికి వక్ఫ్‌ భూములను సేకరిస్తామని వివరించారు. భూముల సేకరణలో ఇకమీదట జాప్యాన్ని నివారిస్తామని, వక్ఫ్‌‌ ఆస్తులు ఆన్యాక్రాంతం కాకుండా చూస్తామని స్పష్టంచేశారు. అందుకు ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలతో సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

వక్ఫ్‌ భూములకు జియోపెన్షింగ్‌ చేయిస్తామని ‌బోర్డు ఛైర్మన్‌ మహ్మద్‌ సలీమ్‌ వెల్లడించారు. వక్ఫ్‌‌బోర్డు ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ శాఖలతో కలసి పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టబోయే అభివృద్ధి పనులకు బోర్డు సహకరిస్తుందని వెల్లడించారు.

Next Story

Most Viewed