నేను పిల్లలను కనగలనో లేదో మీకు తెలుసా?.. నటి ఫైర్

by  |
jennifer aniston
X

దిశ,సినిమా: హాలీవుడ్ స్టార్ నటి జెన్నిఫర్ అనిస్టన్ తాజాగా తన పర్సనల్ లైఫ్‌ గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన నటి.. ‘తనకు పిల్లలను కనడం కన్నా కెరీర్ ముఖ్యమని’ తప్పుగా మాట్లాడుతున్నారని బాధపడింది. అలాగే తన గర్భధారణ గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం బాధాకరమైన విషయమని, ఇలాంటి తప్పుడు వార్తలు తన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది.

‘నేను అన్నింటినీ వ్యక్తిగతంగా తీసుకుంటాను. నా గర్భధారణ గురించి పుకార్లు సృష్టించే వారికి, నా వ్యక్తి గత జీవితం గురించి ఏం తెలుసు? నేను ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నానా? పిల్లలను కనగలనా లేదా? అనే విషయం వారికి తెలుసా?’ అని ప్రశ్నించింది. ‘పురుషులు అనేకసార్లు వివాహం చేసుకున్నప్పటికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ స్త్రీల విషయానికి వస్తే నిబంధనలు వర్తిసాయంటారు. ఈ ప్రపంచంలో మహిళలు విమర్శల నుంచి ఎలా తప్పించుకుంటారో తెలియదు. కానీ తను మాత్రం విమర్శలను పట్టించుకోకుండా జీవితంలో ఎదగాలనే లక్ష్యంతోనే పనిచేస్తాను’ అని ఈ 52ఏళ్ల నటి స్పష్టం చేసింది.

Next Story

Most Viewed