ముగిసిన నరబలి యువకుడి అంత్యక్రియలు.. ఎక్కడంటే..?

55

దిశ, నేరేడుచర్ల: రాష్ట్రంలో సంచలనంగా మారిన నరబలి సంఘటన ఓ కొలిక్కి వచ్చింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలోని గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో మూడు రోజుల క్రితం తల నరికి గ్రామంలోని మెట్ట మహంకాళి అమ్మవారి కాళ్ల వద్ద పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆ యువకుడి స్వ గ్రామం సూర్యపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ చెందిన రమావత్ జయేందర్ నాయక్ (30)గా గుర్తించారు.

విచారణ చేపట్టిన పోలీసులు ఆయన మొండాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా తర్కయంజల్ ప్రాంతంలో గుర్తించారు. ఆ మృతదేహాన్ని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. శూన్యపహడ్ లో శుక్రవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.