అమెరికన్ పాపులర్ యూట్యూబర్ చానల్ బ్యాన్.. ఎందుకంటే?

by  |
american Beauty Youtuber James Charles
X

దిశ, ఫీచర్స్ : అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ జేమ్స్ చార్లెస్ చానెల్‌‌ను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది యూట్యూబ్. మోస్ట్ పాపులర్ క్రియేటర్స్‌లో ఒకరైన జేమ్స్‌ను పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌ను నుంచి రిమూవ్ చేస్తున్నట్లు అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. క్రియేటర్ రెస్పాన్సిబిలిటీ పాలసీని అతిక్రమించిన చార్లెస్.. తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం నుంచి తప్పిస్తున్నట్లు తెలిపింది. 25.5 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ కలిగిన చార్లెస్.. 15 మందికిపైగా మైనర్లకు(బాయ్స్) సెక్సువల్ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు ప్రూవ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. చార్లెస్ ప్రవర్తన యూజర్స్, ఎంప్లాయిస్, ఎకోసిస్టమ్‌కు హాని కలిగిస్తుందనే ఉద్దేశంతో యాక్షన్ తీసుకున్నట్లు తెలిపింది. అయితే మైనర్ బాయ్స్‌తో సెక్సువల్ ఇంటరాక్షన్ జరిగిందన్న ఆరోపణలను ఖండించిన చార్లెస్.. వారు తమ ఏజ్ గురించి అబద్ధం చెప్తున్నారని తెలిపాడు.

బ్యూటీ యూట్యూబర్, మేకప్ ఆర్టిస్ట్ అయిన చార్లెస్.. న్యూయార్క్ బెత్తెహేమ్‌లో పనిచేస్తున్నప్పుడు ట్యుటోరియల్స్ పోస్ట్ చేస్తూ యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాడు. అది కాస్తా పాపులర్ క్రియేటర్స్‌లో ఒకటిగా వరల్డ్ వైడ్ పాపులారిటీ పొందడం విశేషం. కాగా జేమ్స్ చార్లెస్ యూట్యూబ్ చానెల్‌లో 348 వీడియోస్ అప్‌లోడ్ చేయగా.. టోటల్ వ్యూస్ 3.4 బిలియన్ ఉండటం విశేషం.



Next Story

Most Viewed