కరోనాతో జనజీవనం అస్తవ్యస్తం

by  |
కరోనాతో జనజీవనం అస్తవ్యస్తం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జమాత్ ఇస్లామ్ హింద్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవతా దినోత్సవాన్ని జూమ్ యాప్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వేళ ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచిన తొమ్మిది మంది కరోనా యోధులను సత్కరించి ‘ఈ సర్టిఫికెట్’ అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వలస కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవత్వం బతికే ఉందని నిరూపించిన సామాజిక కార్యకర్తలందరికీ అభినందనలు’’. అని అన్నారు.

కరోనా మహమ్మారి ఒకవైపు, గృహహింస మరోవైపు నిర్మూలించడం అసలు మానవత్వం అని సామాజిక కార్యకర్త సుమిత్ర అంకురం అన్నారు. జమాత్ ఇస్లామ్ హింద్ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లామ్ హింద్ సెక్రెటరీ సాదిక్ అహ్మద్, అసిస్టెంట్ సెక్రటరీ అబ్దుల్ మజీద్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆయిషా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

Next Story