అలా మనం చేస్తే ఎలా?: మంత్రులను ప్రశ్నించిన జగన్

by  |
అలా మనం చేస్తే ఎలా?: మంత్రులను ప్రశ్నించిన జగన్
X

ప్రజలను అప్రమత్తం చేస్తూ, మనమే తప్పు చేద్దామంటే ఎలా? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వ్యాప్తి నిరోధానికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ మంత్రులను ప్రశ్నించి షాకిచ్చారు. దాని వివరాల్లోకి వెళ్తే… కరోనా నిరోధంపై జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం సందర్భంగా మంత్రులు, ఏపీలో కరోనా లాక్ డౌన్ సమర్థవంతంగా నడుస్తోందని తెలిపారు. అయితే ఇంకా పటిష్ఠ చర్యల్లో భాగంగా లాక్ డౌన్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నామని, దీంతోనే ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారని, దానిని తగ్గిస్తే వారు బయటకు వచ్చే అవకాశం ఉండదని, తద్వారా కరోనాను తరిమేయవచ్చని సలహా ఇచ్చారు.

మంత్రుల సలహాపై జగన్ స్పందిస్తూ… వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పి, మనమే వారు గుమిగూడేలా చర్యలు చేపడితే కరోనా ఎలా తగ్గుముఖం పడుతుందని ప్రశ్నించారు. నిత్వావసర సరకుల కోనుగోలు సమయాన్ని తగ్గిస్తే ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చే అవకాశముందని, తద్వారా జనసమూహాలు ఏర్పడేందుకు సాక్షాత్తూ మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. దీంతో మంత్రులు అవాక్కయ్యారు. అయితే దీనిపై మరోసారి క్షుణ్ణంగా కసరత్తు చేయాలని వారికి సూచించారు. ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు, మొబైల్ నిత్యావసరాల దుకాణాలను తీసుకెళ్లగలం అన్న ధీమా ఉన్నప్పుడే సమయం తగ్గించే ఆలోచన చేద్దామని ఆయన వారికి సూచించారు.

కరోనా ప్రభావం ఏఏ రంగాలపై పడుతుందో ఆయా రంగాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులకు జగన్ సూచించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో సాగయ్యే మత్స్య పరిశ్రమను ఆదుకునేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రైతులు, రైతు కూలీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వారికి ఆదేశాలు జారీ చేశారు.

Tags : jagan, andhra pradesh, ysrcp, high level meeting,

Next Story

Most Viewed