అవరోధాలు సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యం

by  |
అవరోధాలు సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యం
X

దిశ, నల్లగొండ: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం విపక్ష కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. అభివృద్ధికి అవరోధాలు సృష్టించడమే లక్ష్యంగా వారు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. నియంత్రిత సాగుపై ఆదివారం నకిరేకల్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాలలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన పెంపొందించటమే సదస్సు లక్ష్యమన్నారు. అటువంటి సదస్సులో అనుచిత వ్యాఖ్యాలు చేస్తూ అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు నియంత్రిత సాగుపై తమ వైఖరిని తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎరువులు, విత్తనాల కోసం లాఠీ చార్జీలు జరిపిన చీకటి రోజులు అంతరించిపోవడం బహుశా కాంగ్రెస్ నేతలకు ఇష్టంలేకే ఇలా అడ్డుకుంటున్నారని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed