ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న 62 మంది ఇండియన్స్ సేఫ్

by  |
ITBP commandos
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం హద్దుమీరుతోంది. దేశాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా తాలిబన్లు దాడులకు తెగబడుతున్నారు. మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతూ అచారకం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు ఆయా దేశాల రాయబార సంస్థలను ఎత్తివేస్తూ అధికారులను వెనక్కి రపిస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ కూడా ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న అధికారులను దేశానికి రప్పించింది. అంతేగాకుండా.. ఆఫ్ఘాన్‌లో చిక్కుకున్న 62 భారతీయులను ఐటీబీపీ అధికారులు సురక్షితంగా దేశానికి తరలించారు. దీంతో భారతీయులను దేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీబీపీ కమాండోలను అభినందిస్తున్నారు.

Next Story

Most Viewed