బంగాళాఖాతంలో వాయుగుండం

by  |
బంగాళాఖాతంలో వాయుగుండం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం 24గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల‌ నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సోమవారం తెలిపారు. దాని ప్రభావంతో రాగల 3రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని, తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.

Next Story

Most Viewed