కొత్తపార్టీ దిశగా సచిన్ పైలట్

by  |
కొత్తపార్టీ దిశగా సచిన్ పైలట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాల్లో సచిన్ పైలట్ సంచలనంగా మారారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయనకు పలువురు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. అయితే, ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. తిరుగుబాటు పట్టిన నాయకులపై ఆగ్రహం వ్యక్తి చేసిన అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ను వీడుతున్న నాయకులను పదవుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే అశోక్ గెహ్లాన్ సమక్షంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు.. వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. లేనియేడల అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది.

అయితే, సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాత్రం తమ పార్టీని వీడవద్దని మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సచిన్‌తో సహా మిగతా రెబల్ ఎమ్మెల్యేలు వారి రాజీ ప్రయత్నానికి స్పందిచండం లేదు. సచిన్ బీజేపీలో చేరనని స్పష్టం చేయడంతో.. మరి కొత్త పార్టీ పెడుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్కంఠ వీడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed