జెండర్ బ్యాలెన్స్‌డ్ భారత్ ఇంకెప్పుడు?

by  |
జెండర్ బ్యాలెన్స్‌డ్ భారత్ ఇంకెప్పుడు?
X

దిశ, ఫీచర్స్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. వినేందుకు బాగుంది. జరుపుకునేందుకు ఇంకా బాగుంటుంది. ఈ ఒక్క రోజు మహిళల గొప్పతనాన్ని వివరిస్తూ తమకు నచ్చిన విధంగా ఆర్టికల్స్ రెడీ చేసుకునే నాయకులు, మీడియా, సోషల్ మీడియా.. మహిళలపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటాయి. కానీ ఈ ఒక్కరోజు మాత్రమే ఎందుకు? అన్నది ప్రశ్న. అలాగని మహిళకు గౌరవం లభించడం లేదని కాదు.. కానీ ఎలా? ఎంత వరకు? అనేది సమాజమే ప్రశ్నించుకోవాలి. ఆడపిల్ల అని పొత్తిళ్లలోనే చిదిమేసిన రోజుల నుంచి అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడే రోజులకు చేరుకున్నా.. జెండర్ బ్యాలెన్స్‌డ్ భారత్‌ను ఇప్పటికీ చూడలేకపోతున్నాం అనేది సత్యం.

ఇంపర్‌ఫెక్ట్‌లీ పర్‌ఫెక్ట్

జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంట్లో నుంచే మొదలు కావాలి. అమ్మాయి, అబ్బాయిల మధ్య తేడా లేకుండా పెంచాలి అని చెప్తుంటారు. కానీ ఎంత మంది తల్లిదండ్రులు ఈ మోటో ఫాలో అవుతున్నారు? స్కూలింగ్ నుంచి పెళ్లి చేసి మరో ఇంటికి పంపించే వరకు కూడా అమ్మాయి విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమ్మాయి ఎంత చదివినా.. ఎంత గొప్పగా ఎదిగినా.. చివరికి ఓ సెలబ్రిటీ అయినా సరే.. 25 ఏళ్లు వస్తే చాలు పెళ్లి, పిల్లలు అని వెంటపడుతూనే ఉంటారు. అప్పుడే జాబ్‌లో చేరి, తన కాళ్ల మీద తాను నిలబడే రోజులొచ్చాయి కదా.. తనకు నచ్చిన విధంగా లైఫ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న మహిళలకు ఈ ప్రశ్నలు స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాయి. అసలే ఎలాంటి పార్ట్‌నర్ కావాలో చూజ్ చేసుకునేందుకు కన్‌ఫ్యూజన్‌లో ఉండే అమ్మాయికి ఈ ప్రశ్నలన్నీ మెంటల్ టార్చర్‌లా తయారవుతుంటాయి. ఒకవేళ పార్ట్‌నర్ దొరికి పెళ్లి చేసుకున్నామో! ఇక అప్పటి నుంచి ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావ్? పెళ్లయ్యి వన్ ఇయర్ అయిపోయింది కదా.. ఇంకా ప్లాన్ చేసుకోలేదా? అనే క్వశ్చన్స్ ఎదురవుతుంటాయి. అంటే పెళ్లి, పిల్లలు అనే విషయంలో సొసైటీ నుంచి అమ్మాయి పట్ల కాన్‌స్టంట్ జడ్జ్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడు ఎలా లైఫ్ డిజైన్ చేసుకోవాలనే విషయం ఆడపిల్లకు తెలియదని ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తుంటారా? ఈ క్రమంలో ఒత్తిడిని ఎదుర్కొన్న అమ్మాయి పెళ్లికి ఓకే అనేసి.. తొందరపాటు నిర్ణయంతో లైఫ్‌ను చేజేతులా నాశనం చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. అంటే 25 ఏళ్లు వస్తే ఇవన్నీ చేయాలనే రూల్ లేదు కదా.. కొంచెం లేటైనా.. తను ఇంపర్‌ఫెక్ట్ అనుకున్నా.. తనకు నచ్చిన విధంగా పర్‌ఫెక్ట్ లైఫ్‌ను లీడ్ చేయగలదు కదా.

చేంజ్ యువర్ మైండ్ సెట్

మారుతున్న జనరేషన్‌తో పాటు అమ్మాయి కూడా మారుతోంది. చాలా పాజిటివ్ వేలో దూసుకుపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్బాయిల కన్నా కూడా మితిమీరిన వేగంతో తను ఎంచుకున్న రంగంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగులుగుతోంది. అందుకు తగిన విధంగా మోడ్రన్‌ లైఫ్‌స్టైల్‌ను లీడ్ చేస్తున్నా..ఎక్కడో ఇన్‌సెక్యూరిటీ మాత్రం ఉండనే ఉంటుంది. పనిచేసే సంస్థల్లో యువతుల పనికి తగినట్లుగా అప్రిషియేషన్స్, హైక్స్ అందుతున్నా.. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు దక్కించుకుంటున్నా సరే, మేల్ డామినేషన్ సొసైటీలో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంది. గర్ల్ లిబరేషన్, ఫ్రీడమ్ అంటూ ఎంత మంది ఎన్ని స్పీచ్‌లు ఇచ్చినా.. జెండర్ బ్యాలెన్స్‌డ్ సొసైటీని మాత్రం చూడలేకపోతున్నాం. ‘అమ్మాయి అభివృద్ధి’, ‘అమ్మాయి మీద వివక్ష’.. ఈ రెండింటి మధ్య పోటీ పెడితే వివక్షనే విన్ అవుతుంది. అంటే అమ్మాయి అభివృద్ధి చెందుతున్న తీరు ఆదర్శంగా నిలుస్తున్నా ఎప్పటికప్పుడు వివక్షనే విజయం సాధిస్తోంది.

అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి రెండు లక్షల జీతం.. అబ్బాయికి లక్ష జీతం. అంటే అమ్మాయి అబ్బాయి కన్నా లక్ష రూపాయలు ఎక్కువగా సంపాదిస్తోంది. అయినా సరే ఇంటికి వస్తే మేల్ డామినేషనే ఉంటుంది. వేల ఏళ్లుగా పాతుకుపోయినా పితృస్వామ్య వ్యవస్థనే రాజ్యమేలుతోంది. అంత కష్టపడి ఇంటికి వచ్చాక అమ్మాయి మాత్రమే ఇంటి, వంట పని చేయాల్సి వస్తోంది. ఎప్పటిలాగే.. మగాడు మగాడిలాగే తాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ కారణంగానే 50 శాతం మంది లేడీ టెకీలు 30 ఏళ్లకు ముందే జాబ్‌కు గుడ్‌బై చెప్పేసి.. ఇంటికి పరిమితం అవుతున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. అంటే సక్సెస్ ఉన్నా సరే.. మేల్ డామినేషన్ కారణంగా ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. స్త్రీలు పురుషుల కన్నా మూడు రెట్ల అన్‌పెయిడ్ వర్క్ చేస్తుంటే.. కనీస గుర్తింపు, సపోర్ట్ కూడా అందకపోవడం శోచనీయం.

Next Story

Most Viewed