ఇన్సూరెన్స్ పాలసీదారులారా.. మీకో గుడ్ న్యూస్!

by  |
ఇన్సూరెన్స్ పాలసీదారులారా.. మీకో గుడ్ న్యూస్!
X

దిశ, వెబ్‌డెస్క్: బీమా పాలసీ తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) ఊరట కలిగించే వార్తను అందించింది. మార్చి నెలకు రెన్యూవల్ చేసుకోవాల్సిన పాలసీల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పాలసీ రెన్యూవల్ గడువును మే 31 వరకూ పొడిగించింది. ఐఆర్‌డీఏఐ ఇంతకుముందు మార్చి, ఏప్రిల్ నెలల ప్రీమియం చెల్లింపులకు 30 రోజుల అదనపు గ్రేస్ పీరియడ్ కల్పించిన సంగతి తెలిసిందే. మరోసారి పాలసీల ప్రీమియం చెల్లింపుల గడువును పొడిగించింది. కేంద్రం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించిన నేపథ్యంలో పాలసీదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇది వర్తిస్తుందని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. పొడిగించిన గడువుతో మార్చి 31 నాటికి చెల్లించాల్సిన పాలసీలను మే 31లోపు చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే, పాలసీ ప్రీమియం మొత్తాన్ని ఆన్‌లైన్ విధానంలో చెల్లించే వెసులుబాటును పాలసీదారులకు కల్పించాలని ఐఆర్‌డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. అయితే, పాలసీదారులు ప్రీమియం మొత్తాన్ని నిర్దేశించిన గడువులోగా చెల్లించి పాలసీ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది.



Next Story

Most Viewed