లెబనాన్‌కు పెట్రోలియం పంపుతున్నాము: ఇరాన్

by  |
lebanon
X

దిశ వెబ్‌డెస్క్: లెబనాన్‌కు మరిన్ని పెట్రోలియం బారెళ్లలను పంపడానికి ఇరాన్ నిర్ణయించింది. ఇప్పటికే బీరూట్‌లో ప్రజలు నిత్యావసరాలు, విద్యుత్, పెట్రోల్ కోసం అల్లాడుతున్నట్లు తెలుస్తోంది. కానీ పెట్రోల్ దిగుమతి చేసుకోవడానికి అవసరమైన మేర నిల్వలు ప్రస్తుతం లెబనాన్ ప్రభుత్వం దగ్గర లేవు. అయినప్పటికి ఆ దేశానికి అవసరమైన మేర పెట్రోలియం నిల్వలను పంపడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయిద్ ఖాతిబాజెహ్ వెల్లడించారు. ‘అక్కడ ప్రజలు నిత్యవసరాల కోసం అల్లాడుతున్నారు. ఇలాంటి అత్యవసర సమయాల్లో మేం చేతులు ముడుచుకుని కూర్చోము’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఆదివారం ఇరాన్ పోర్ట్ నుంచి ఒక ఆయిల్ నౌక లెబనాన్ బయల్ధేరిందని టెహ్రన్ కేంద్రంగా నడిచే కొన్ని వార్త సంస్థలు వెల్లడించాయి. అయితే అమెరికా జేపీసీఏ ఒప్పందాన్ని ఇది ఉల్లఘించినట్లు అవుతుందని ఉగ్రవాద సంస్థ హెజ్‌బుల్లా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ నుంచి ఏ దేశం కూడా ముడి చమురు దిగుమతి చేసుకున్న వాటిపై తన ఆంక్షల కొరడా ఝలిపిస్తుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఉన్న లెబనాన్‌పై అమెరికా కొత్తగా ఆంక్షలు విధిస్తే పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, లెబనాన్ లో 1975- 1990 మధ్య అంతర్యుధ్దం జరిగింది. దాని తరువాత రాజకీయ అస్థిరత ఏర్పడి ఆ దేశం ఇప్పటివరకు కోలుకొలేదు. పశ్చిమాసియాలో తొలి ఉగ్రవాద సంస్థ అయిన హెజ్‌బుల్లా కేంద్ర స్థానం లెబనానే. దీనిని 1980 ప్రాంతంలో ఇరాన్ విదేశీ దళం అయిన ఖుద్‌ఫోర్స్ స్థాపించింది. ఇది ప్రధానంగా షియా మిలిషియా.

Next Story

Most Viewed