ఐపీఎస్.. ఇంటి పనిలో భేష్

by  |
ఐపీఎస్.. ఇంటి పనిలో భేష్
X

దిశ, హైదరాబాద్: ఆయనో ఐపీఎస్ అధికారి. ఆయన ఏ పని చేసినా నలుగురికి మార్గదర్శకంగా నిలిచేందుకే కృషి చేస్తారు. ఐపీఎస్ అధికారిగా ప్రభుత్వ విధుల్లో చేరిన ఆయన.. ఆ తర్వాత రాష్ట్ర విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఎవరూ ఊహించని విధంగా సంచలనాత్మక విజయాలను సాధిస్తున్నారు. ఆయనే తెలంగాణ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.

ఇంటి పరిసరాలు శుభ్రం చేస్తూ..

మాసబ్ ట్యాంక్‌లోని గురుకుల ప్రధాన కార్యాలయంలో ‘‘ఈ కార్యాలయం మీది. చెప్పులు విడవకండి. ఎవ్వరికీ ఒంగి ఒంగి దండాలు పెట్టకండి’’ అంటూ నోటీస్ బోర్డులో రాసి పలువురు ప్రభుత్వ అధికారులకు ఆదర్శంగా నిలిచారు. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురుకుల విద్యాలయాలకు సెలవులిచ్చారు. దీంతో నిత్యం ఏదో ఒక పనిలో ఉండే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఇంటి పనిలో నిమగ్నమయ్యారు. స్వయంగా చీపురు పట్టుకుని ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Tags : corona effect, lock down, praveen kumar, cleaning his house

Next Story