IPL 2023: ముంబైకి బిగ్ షాక్.. చెన్నైతో మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం

by Satheesh |   ( Updated:2023-05-06 10:14:10.0  )
IPL 2023: ముంబైకి బిగ్ షాక్.. చెన్నైతో మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ జరుగుతోన్న కీలక మ్యాచ్‌కు ముంబై స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ దూరమయ్యాడు. జ్వరం కారణంగా తిలక్ వర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్ ముంగిట కీలకమైన మ్యాచ్‌కు తిలక్ వర్మ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ గెలిచిన మ్యాచుల్లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో తన జట్టుకు విజయాలు అందించాడు. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై మొదట బౌలింగ్ ఎంచుకుంది.

Advertisement

Next Story

Most Viewed