IPL 2023: టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్..

by Vinod kumar |
IPL 2023: టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

కెప్టెన్‌ రాకతో SRHకు బలం..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ బాగున్నా ఎందుకో బ్యాలెన్స్‌ కుదర్లేదు. తొలి మ్యాచులో రాజస్థాన్‌ ఇచ్చిన పెద్ద టార్గెట్‌ ఛేజింగ్‌లో ఒత్తిడికి గురయ్యారు. కెప్టెన్‌ అయిడెన మార్‌క్రమ్‌ రావడం కొండంత బలం. అభిషేక్‌, మయాంక్‌ మెరుపు ఓపెనింగ్స్‌ ఇవ్వగలరు. మిడిలార్డర్లో రాహుల్‌ త్రిపాఠి, హ్యారీ బ్రూక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఫిలిప్స్‌, సుందర్‌ బ్యాటింగ్‌ కీలకంగా మారనుంది. కెప్టెన్‌ రాకతో మిడిలార్డర్‌ పటిష్ఠం అవుతుంది. ఇక ప్రధాన బౌలర్ భువీ వికెట్లు తీయాలి. ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌ బౌలింగ్‌ బాగుంది.

ఇక లక్నో సూపర్ జెయింట్స్‌ ఈ సీజన్‌‌లో మరింత పటిష్ఠంగా కనిపిస్తోంది. కైల్‌ మేయర్స్‌ రాకతో టాప్‌ ఆర్డర్‌ దూకుడుగా మారింది. అయితే కేఎల్‌ రాహుల్‌ తన స్థాయి బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. సఫారీ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ రావడం గుడ్‌ సైన్‌! అయితే ఇప్పుడు ఆడుతున్న నలుగురు ఫారినర్స్‌లో ఎవరిని తీసేయాలన్నదే సమస్యగా ఉంది. దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య జోరు పెంచాలి.

పిచ్‌ ఎలా ఉందంటే..?

తొలి మ్యాచుల్లో లక్నో ఏకనా పిచ్ ప్రవర్తన అర్థమవ్వలేదు. పేస్‌ బౌలర్లు, స్పిన్నర్లకు అనుకూలించింది. రాగానే బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. అయితే నిలబడితే సిక్సర్లు, బౌండరీలు కొట్టగలరు. అటు పేస్‌, ఇటు స్పిన్‌ను ఉపయోగపడుతుంది. బౌండరీలూ పెద్దవే.. రెండు జట్లకూ సమాన అవకాశాలే ఉంటాయి. ఈ పిచ్‌పై లోకల్‌ బాయ్‌ భువీకి అనుభవం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ XI:

కెఎల్ రాహుల్ (సి), కె మేయర్స్, ఎన్ పూరన్ (వికె), డి హుడా, ఎం స్టోయినిస్, కె పాండ్యా, ఎ మిశ్రా, ఆర్ బిష్ణోయ్, వై ఠాకూర్, జె ఉనద్కత్, ఆర్ షెపర్డ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ XI:

ఎం అగర్వాల్, ఎ సింగ్ (వికెట్), ఆర్ త్రిపాఠి, హెచ్ బ్రూక్, ఎ మార్క్‌రామ్ (సి), డబ్ల్యూ సుందర్, ఎ సమద్, బి కుమార్, టి నటరాజన్, యు మాలిక్, ఎ రషీద్.

Next Story

Most Viewed