IPL 2023: చెలరేగిన లక్నో.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం

by Satheesh |
IPL 2023: చెలరేగిన లక్నో.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో భారీ స్కోర్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అటల్ బీహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు సరైన శుభారంభం లభించలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 12 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

రాహుల్ నిరాశపర్చిన మరో ఓపెనర్ కైల్ మేయర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 38 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, రెండు ఫోర్ల సహయంతో 73 పరుగులు చేశాడు. దీపక్ హుడా 17, కృనాల్ పాండ్యా 15, మార్కస్ స్టోయినిస్ 12 పరుగులు చేశారు. చివర్లో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ 21 బంతుల్లో 36 పరుగులు చేయగా.. మరో యంగ్ బ్యాటర్ ఆయుష్ బదోని 7 బంతుల్లో 18 పరుగులు చేయడంతో లక్నో 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ బరిలోకి దిగింది.

Next Story