బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 200 లక్షల కోట్లకు

by  |
బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 200 లక్షల కోట్లకు
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ వచ్చిన వేళ దేశీయ ఈక్విటీ మార్కెట్లలో జోరు పెరిగింది. కీలక సూచీలన్నీ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను దక్కించుకొని ర్యాలీ చేస్తున్నాయి. దీంతో ఇటీవల ఇన్వెస్టర్ల సంపద రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. గురువారం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత స్వల్పంగా నష్టాలను చూసినప్పటికీ, మిడ్ సెషన్ తర్వాత మార్కెట్ల జోరుతో పెట్టుబడిదారుల సంపద భారీగా పెరిగింది. అనంతరం సెన్సెక్స్ ఇండెక్స్ జీవితకాల గరిష్ఠాలతో ముగియడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్లను దాటింది. అంతకుముందు ఇది రూ. 198.3 లక్షల కోట్లుగా ఉంది.

గురువారం నాటి సెషన్‌లో 358 పాయింట్లు ర్యాలీ చేయడంతో సెన్సెక్స్ 50,614, నిఫ్టీ 14,895 వద్ద సరికొత్త రికార్డులను సాధించాయి. ముఖ్యంగా ఐటీసీ 6 శాతం, ఎస్‌బీఐ 5.73 శాతం, బజాజ్ ఫినాన్స్ 4.85 శాతం, ఓఎన్‌జీసీ 4.75 శాతంతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత సెన్సెక్స్ గడిచిన నాలుగు సెషన్లలోనే 4,189 పాయింట్లను సాధించింది. ఈ ర్యాలీ నేపథ్యంలో పెట్టుబడిదారుల సంపద రూ. 13.99 లక్షల కోట్లకు పెరిగింది. కాగా, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 2014 నవంబర్28న మొదటిసారిగా రూ. 100 లక్షల కోట్లకు చేరుకుంది. అనంతరం, గతేడాది కరోనా నేపథ్యంలో ఈ స్థాయికి పడిపోయినప్పటికీ, లాక్‌డౌన్ తర్వాతి పరిణామాల్లో ఇది రెట్టింపు స్థాయిలో రూ. 200 లక్షల కోట్లకు చేరుకుంది.

Next Story

Most Viewed