పవర్ హౌస్ ఘటనపై సీఐడీ డీజీ నేతృత్వంలో విచారణ

by  |
పవర్ హౌస్ ఘటనపై సీఐడీ డీజీ నేతృత్వంలో విచారణ
X

దిశ, క్రైమ్‌బ్యూరో: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సీఐడీలో పనిచేస్తున్న సుమతితో పాటు పలువురు డీఎస్పీ స్థాయి అధికారులు, ఇతర అధికారుల బృందంతో దర్యాప్తును ప్రారంభించారు. శనివారం ఘటనా స్థలాన్ని దర్యాప్తు బృందం పరిశీలించి, అధికారులతో మాట్లాడింది.

జల విద్యుత్ కేంద్రంలో ఏమైనా మానవ తప్పిదం చోటు చేసుకుందా.. సాంకేతికంగా లోపాలు ఎదురయ్యాయా అనే అంశాలను బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రొడక్షన్ సమయంలో బ్యాటరీ మరమ్మతులను ఎందుకు చేయాల్సి వచ్చింది ? మరమ్మతులు అత్యవసరమైతే విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు నిలిపివేయలేదు ? బ్యాటరీల లైఫ్ ఎన్నాళ్లు ఉంది. గడువు పూర్తయినా అలాగే కొనసాగిస్తున్నారా ? ఉత్పత్తి ప్రారంభానికి కంటే ముందు అన్నిరకాల మిషనరీలను సిద్దంగా ఉన్నట్టు గమనించారా లేదా అనే విషయాలపై గోవింద్ సింగ్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed