కరోనాతో ఫైట్.. ఇండియాకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల మద్దతు

by  |
కరోనాతో ఫైట్.. ఇండియాకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల మద్దతు
X

దిశ, సినిమా : ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఇండియాకు మద్దతిస్తున్నారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు వీలైనంత సాయం చేయాలని ప్రపంచాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో స్టార్స్ కేటీ పెర్రీ, కామిలా కాబెల్లో మరియు రీస్ విథర్ స్పూన్ సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజింగ్‌కు రిక్వెస్ట్ చేశారు. మహమ్మారిపై భారతీయులు సమర్థవంతంగా పోరాడటానికి అవసరమైన వనరులపై కేటీ పెర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంపార్టెంట్ మెసేజ్ షేర్ చేసింది. ‘ప్రస్తుతం భారతదేశంలో కరోనా విజృంభణ గురించి వింటున్నాం. ప్రతిరోజూ కొవిడ్ కేసుల సంఖ్య కొత్త ప్రపంచ రికార్డును సృష్టిస్తోంది. ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ సహా ముఖ్యమైన సామాగ్రి కొరతతో జనం ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో Thebritishasiantrust కు చెందిన తన స్నేహితులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ఇండియాకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు సాయం చేయాలనుకుంటే, దయచేసి విరాళం ఇవ్వండి’ అని పోస్ట్ చేసింది.

గ్లోబల్ సెలబ్రిటీ కామిలా కాబెల్లో లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇండియాలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను వివరించిన ఆమె.. జనాలను రక్షించుకునేందుకు కావాల్సిన వనరులు అవసరమని తెలిపింది. తన ఫ్రెండ్స్ 1 మిలియన్ డాలర్ ఫండ్ రైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దయచేసి ప్రతీ ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. ప్రతీ డాలర్ కూడా విలువైనదేనని, మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

‘నా దేశం కష్టంలో ఉంది హెల్ప్ చేయండి’ అంటూ అభ్యర్థించిన ప్రియాంక చోప్రా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్ చేసిన స్టార్ రీస్ విథర్ స్పూన్.. భారతదేశంలో అత్యవసర పరిస్థితి నెలకొందని, వీలైనంత సాయం చేయాలని అభిమానులను కోరింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed