వడ్డీ తగ్గినా సరే..చిన్న మొత్తాల పొదుపే లాభదాయకం!

by  |
వడ్డీ తగ్గినా సరే..చిన్న మొత్తాల పొదుపే లాభదాయకం!
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 కారణంగా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఒక ప్రకటన వెలువడింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఏప్రిల్ త్రైమాసికానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పలు పథకాల వడ్డీ రేట్లలో 0.7 శాతం నుంచి 1.5 శాతం వరకూ మార్పులు జరిగాయి. ఈ తేడాలతో రాబోయే కాలంలో ఆయా పథకాల్లో వచ్చే పెట్టుబడులపై రాబడులు క్షీణిస్తాయి. అయితే, వీటితో పాటు బ్యాంకు డిపాజిట్ల వడ్డీ రేట్లలో కూడా మార్పులు జరిగాయి కాబట్టి బ్యాంకు డిపాజిట్ల కంటే చిన్న మొత్తాల పొదుపు పథకాలే కొంచెం మెరుగని తెలుస్తోంది.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ వడ్డీ రేటు ఇదివరకటి లాగే 4 శాతం ఉంది. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించారు. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ రేటును 7.1 శాతానికి తగ్గించారు. కిసాన్ వికాస్ పత్ర రేటును 6.9 శాతానికి తగ్గించారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు 0.7 శాతం ఈ పథకం వడ్డీ రేటులో మార్పు ఉంది. ఆడపిల్లల కోసం కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పథకానికి వడ్డీ రేటుని 7.6 శాతానికి తగ్గించారు. ప్రధానంగా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పథకాల వడ్డీ రేటు ఇప్పటికీ 7 శాతానికి పైగా ఉండటం వల్ల రాబడి పెద్దగా తగ్గే అవకాశాల్లేవని సంబంధిత వర్గాల వారు అభిప్రాయపడుతున్నాయి.

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పు చేయడం 2012 నుంచి జరుగుతున్నదే. ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం వీటిలో మార్పు చేస్తూ వస్తోంది. ప్రస్తుత పరిణామాల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను చాలావరకు తగ్గించడంతో వీటిని కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6.2 శాతంలోపే ఉంది. దీనితో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ వడ్డీ రేటు 6.7 శాతంతో అధికంగా ఉంది.

Tags: Nsc, PPF, SCSS, Small Savings, post office



Next Story

Most Viewed