బిగ్ బ్రేకింగ్.. జూన్ 29న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు

by  |
బిగ్ బ్రేకింగ్.. జూన్ 29న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ జూన్ 29 విడుదల చేయనుంది. సోమవారం విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. డిగ్రీ, పీజీ పరిక్షల నిర్వహణ అంశంపై నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు పాఠశాలల నిర్వహణ అంశాలను కూడా పరిశీలించనున్నారు. జులై 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలను రద్ధు చేసి విద్యార్థులందరిని పై తరగుతులకు ప్రమోట్ చేసిన ప్రభుత్వం మార్కుల కేటాయింపుల పై విధివిధాలను ప్రకటించింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు మార్కులను 100శాతం అందించాలని నిర్ణయించారు. సెంకండ్ విద్యార్థులకు ఫస్టియర్ ఫలితాల ఆధారంగా మార్కులను కేటాయించి మెమోలను జారీ చేయనున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొదటి సంవత్సరంలో బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులకు కనీసం 35 శాతం మార్కులతో పాస్ చేయనున్నారు. ప్రైవేటుగా పరీక్షలు రాసేందుకు ఫీజు కట్టిన విద్యార్థులకు కూడా 35 శాతం మార్కులతో పాస్ చేయనున్నారు.

Next Story

Most Viewed