పెళ్లి మండపంలో వధువు చేసిన పనికి షాకైన వరుడు

by  |
పెళ్లి మండపంలో వధువు చేసిన పనికి షాకైన వరుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లి చేసేటప్పుడు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా పెళ్లి జరిగిపోవాలని కోరుకుంటారు. కానీ, పెళ్లి వేడుకలలో పెళ్లికూతురికే గాయాలు అయితే.. అవును ఎంతో ఆనందంగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న అనుకున్న వధువును తన పెళ్లి వేడుకనే ప్రమాదంలోకి నెట్టింది. తన ఆనందాన్ని అంతా చిటుకలోనే మాయం చేసింది. వివరాల్లోకి వెళ్లితే..బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. చాలా ఆనందంగా పెళ్లి జరిగింది. ఇక వధువు, వరుడు దండలు మార్చుకుంటున్నారు. ఆ సమయంలోనే బంధువులు సంబరంగా టపాసులు కాల్చుతున్నారు. అయితే పెళ్లి కూతురు, పెళ్లికొడకు సరిగ్గా దండలు మార్చుకునే సమయం, పెళ్లి కూతురు కెమెరా వైపు చూస్తుండగానే టపాసు పేలిన శబ్ధం వెంటే స్టేజిమీద నుంచి వధువు పడిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పెళ్లి కొడుకు ప్రమాదాన్ని గుర్తించి. వెంటనే వధువును ఆసుపత్రికి తరలించారు. అయితే పెళ్లి కూతురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story

Most Viewed