చంపుడు పందానికి సై అన్న హిడ్మా.. జిల్లా పోలీసు బాస్ కి ఫోన్లో సవాల్…?

by  |
చంపుడు పందానికి సై అన్న హిడ్మా..  జిల్లా పోలీసు బాస్ కి ఫోన్లో సవాల్…?
X

దిశ వాజేడు: నక్సలిజం చరిత్రలో మరో చీకటి అధ్యాయనం ..రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ బీజాపూర్ సమీపంలోని తరెం అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ల పై భీకర దాడి జరిగింది. దీంతో పచ్చని అడవి అంతా జవాన్ల రక్తంతో ఎర్రబడిపోయింది. అయితే ఈ భీకర దాడికి సూత్రధారి హిడ్మాగా భావిస్తున్నారు. ఆయన ఏకంగా బీజాపూర్ జిల్లా ఎస్పీ కి ఫోన్ లో చంపుడు పందానికి సై అంటు సవాల్ విసిరినట్లు సమాచారం.

మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పింపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ( పి ఎల్ జి ఏ) నంబర్ వన్ బెటాలియన్ కు కమాండర్ గా ఛత్తీస్ గఢ్ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ (డీకే ఎస్ జెడ్ సీ) సభ్యుడిగా పని చేస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో చాలా వరకు ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫార్మర్ల తో పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించి చంపుడు పందానికి సై అంటూ త్రిశూల వ్యూహం పోలీస్ జవాన్లపై దాడికి దిగినట్లు సమాచారం.

ఇతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు రెండు వేల మంది పోలీసు బలగాలను అడవిలోకి పంపి జల్లెడ పట్టడం ముందస్తుగా పసిగట్టిన హిడ్మా పోలీస్ జవాన్లపై మెరుపు దాడి చేసి 24 మంది పోలీస్ జవాన్లను మట్టు పెట్టాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ప్రస్తుత మావోయిస్టు పార్టీ లో చేరాడు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కుసుమ జిల్లా పూవర్తి ప్రాంతానికి చెందిన గిరిజనుడు.. ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రమే పూర్తిచేసిన ఇతడు మావోయిస్టు ఆపరేషన్లు దిట్టగా పేరుపొందాడు.

యుద్ధ నైపుణ్యం మెలకువలను కేడర్ కు నూరిపోయడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీసు బలగాల పై సీఆర్పీఎఫ్ క్యాంపుపై మెరుపువేగంతో దాడులు నిర్వహించడం లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. పార్టీలో పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అంతటి గనుడు కాబట్టి జిల్లా పోలీసు బాస్ కు సవాల్ విసిరి మరి దాడి జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసు బలగాల పై చాకచక్యంగా మెరుపు దాడి చేపట్టి 24 మంది జవాన్లను మట్టు పెట్టగా మరో 30 మంది జవాన్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అదేవిధంగా 15 మంది మావోయిస్టుల సైతం మృతి చెందినట్లు సమాచారం. ఆ మృతదేహాలను పోలీస్ అధికారుల కంట పడకుండా ముందస్తుగానే ట్రాక్టర్ల ద్వారా వారికి అనువైన ప్రదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది.

Next Story