16నుంచి ఇండో డేటా వీక్

by  |
16నుంచి ఇండో డేటా వీక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో ఈనెల 16నుంచి 22వరకు ఇండో డేటా వీక్ రెండో ఎడిషన్ వర్చువల్ సమావేశం జరుగనుంది. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నుంచే సమన్వయం చేస్తుండగా.. గతేడాది గచ్చిబౌలిలోని హయత్ హోటల్‌లో నిర్వహించారు. అప్పుడు 300మందికి పైగా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి కొన్ని ప్రపంచ సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈసారి అదే స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్గనైజర్, డీఏవీ డేటా సొల్యూషన్స్‌కు చెందిన పార్వతి కృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్ రంజన్, నెదర్లాండ్స్‌లోని వరల్డ్ స్టార్టప్ నుంచి గెరిట్ జాన్, సిస్కో లాంచ్ ప్యాడ్ తరపున కన్నన్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పేదరికం, అసమానతలు, పర్యావరణ మార్పు, సుస్థిరత, శాంతి, న్యాయం వంటి సమస్యలను పరిష్కరించడంలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం గురించి చర్చిస్తారన్నారు.

Next Story