భారత తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టర్మినల్.. ఎక్కడంటే

by  |
భారత తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టర్మినల్.. ఎక్కడంటే
X

దిశ, ఫీచర్స్ : భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజినీర్లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. కర్ణాటకలోని ముద్దనహళ్లికి చెందిన విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్, విద్యా రంగంలో విశేష సేవలందించారు. మైసూరు సంస్థానంలో ఇంజినీర్‌గా పనిచేసిన విశ్వేశ్వరయ్యను కర్ణాటక పితామహుడిగా అభివర్ణిస్తారు. ఇక ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వరించింది. హైదరాబాద్‌ మహానగరాన్ని మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలు రూపొందించిన విశ్వేశ్వరయ్య.. భారతదేశంలో అద్భుత నిర్మాణాలెన్నింటికో ఆద్యుడు. కాగా, కర్ణాటకలో అలాంటి అద్భుత నిర్మాణమొకటి త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత్‌లో తొలి సెంట్రలైజ్‌డ్ ఏసీ రైల్వే టర్మినల్‌ను మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరున బెంగళూరులో ఏర్పాటు చేయగా.. ఆ టర్మినల్ ఫొటోలను తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఈ రైల్వే టర్మినల్‌లో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్ విత్ డిజిటల్.. రియల్ టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, విలాసవంతమైన ఫుడ్ కోర్టు, 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.314 కోట్ల వ్యయంతో 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్ట్ మాదిరి సకల హంగులతో తీర్చిదిద్దుతున్నారు. 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, 20 క్యాబ్స్, 5 బస్సులు నిలుపుకునేలా పార్కింగ్ సదుపాయం కల్పిస్తుండటంతో పాటు ఇక్కడి ఫుడ్ కోర్టులో మొత్తం 50 వేల మందికి ఫుడ్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 50 ట్రైన్లు ఇక్కడి నుంచి ఆపరేట్ కానుండగా.. ఈ నెల చివర్లో టర్మినల్ అందుబాటులోకి రానుంది.

Next Story

Most Viewed