ఇండియన్ రైల్వే నూతన ప్రయోగం.. త్వరలో హైడ్రోజన్ ట్రైన్లు‌

by  |
Trains canceled,
X

న్యూ ఢిల్లీ: కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త పథకాలు ‘అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్’, ‘నేషనల్ హైడ్రోజన్ మిషన్’ లో భాగంగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2015 లో పారిస్ పర్యావరణ ఒప్పందంలో 2030 కల్లా రైల్వేలో కర్భన ఉద్గారాలు లేకుండా నడిపిస్తామని సంతకం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ తో నడిచే రైళ్లను ప్రస్తుతం హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కి.మీల ట్రాక్ డిజీల్, ఎలక్ర్టిక్ రైళ్లపై ఫైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఆగస్టు 17న వేలం సమావేశం నిర్వహించి, అక్టోబర్ 5 వరకు పూర్తి చేయాలని చూస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Next Story