ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ త్రైమాసిక లాభం రూ. 121 కోట్లు

by  |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ త్రైమాసిక లాభం రూ. 121 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (indian overseas bank) రూ. 121 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 342.08 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ఇక, గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో బ్యాంక్ రూ. 144 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 5,236.63 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 5,006.48 కోట్లుగా ఉంది. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల బ్యాంకు వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో రూ. 4,302 కోట్లుగా ఉందని, గతేడాది ఇది రూ. 4,336.39 కోట్లుగా నమోదైనట్టు బ్యాంకు పేర్కొంది. బ్యాడ్ లోన్ల కారణంగా ఈ త్రైమాసికంలో కేటాయింపులు రూ. 969.52 కోట్లకు తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది.

ఇక, స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) జూన్ 30 నాటికి 13.90 శాతానికి తగ్గాయని, గతేడాది ఇది 22.53 శాతంగా ఉంది. విలువ పరంగా స్థూల ఎన్‌పీఏలు రూ. 18,290.84 కోట్లకు తగ్గాయి. అదేవిధంగా, నికర ఎన్‌పీఏలు 11.04 శాతం నుంచి 5.10 శాతానికి టగ్గాయి. ప్రస్తుత ఏడాది జూన్ 30 నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ. 2.26 లక్షల కోట్లకు పెరిగాయని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. గతేడాది జూన్ నాటికి మొత్తం డిపాజిట్లు రూ. 2.21 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.



Next Story

Most Viewed