ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం లేదు : ఆర్థికవేత్త!

by  |
ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం లేదు : ఆర్థికవేత్త!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ వేగంగా కోలుకోవడంలేదని, 25 శాతం వరకు కుదించుకుపోవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త, దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ అరుణ్ కుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ భారీ క్షీణత ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ భారత ఆర్థిక వృద్ధి ప్రభుత్వం చెబుతున్నంత వేగంగా కోలుకోవడంలేదు. అసంఘటిత రంగంతో పాటు సేవల రంగంలోని ప్రధాన విభాగాలు కోలుకోవడం ఇంకా ప్రారంభం కాకపోవడమే దీనికి కారణమని’ ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 25 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని, ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాల్లో ఉత్పత్తి పూర్తిగా లేకపోవడమని తెలిపారు. అదేవిధంగా భారత ఆర్థిక లోటు గతేడాది కంటే ఎక్కువగా ఉంటుందని, రాష్ట్రాల ఆర్థిక లోటు చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ ఎంత వేగంగా ప్రజలకు చేరువ అవుతుంది, ప్రజలు తిరిగి కరోనాకు ముందు స్థాయిలో ఉండగలరనే దాన్ని బట్టి ఆర్థిక పునరుద్ధరణ ఆధారపడి ఉందని అరుణ్ కుమర్ వెల్లడించారు.

Next Story