హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై నేడు నిర్ణయం

by  |
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై నేడు నిర్ణయం
X

న్యూఢిల్లీ: హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ఎగుమతికి అనుమతించాలని ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నేడు దీనిపై నిర్ణయం తీసుకోనుంది. మన దేశానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏ మేరకు అవసరమవుతుందన్న అంచనాపై కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలతో సోమవారం సమీక్ష జరిపింది. మన దేశానికి అవసరం ఉన్న దాని కంటే 25 శాతం అధికంగా నిల్వ ఉంచడానికి సంబంధించి హెల్త్ మినిస్ట్రీ అంచనాలు ఇచ్చిన తర్వాత ఎగుమతిపై నేడు నిర్ణయం వెలువడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

కొవిడ్ 19ను ఎదుర్కోవడంలో ఈ యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను నిపుణులు పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులకు ఇతర ఔషధాలు సహా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను అందిస్తూ ఫలితాలను పరిశీలిస్తున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ సహా దాని ఫార్ములేషన్ లను ఉత్పత్తి చేస్తున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. ఈ నేపథ్యంలోనే అమెరికా సహా స్పెయిన్ బ్రెజిల్ లాంటి దేశాలు తమకు ఈ డ్రగ్ పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటివరకు కొవిడ్ 19 చికిత్సకు గుర్తింపు పొందిన విరుగుడు లేదా ఔషధం అందుబాటులో లేదు.

Tags: Coronavirus, anti malaria drug, hydro chloroquine, export, decision

Next Story

Most Viewed