షాకింగ్ న్యూస్.. ఆసియా అండర్ -22 ఛాంపియన్‌షిప్ నుండి భారత్ ఔట్..

103
boxing

న్యూఢిల్లీ: ఆసియా అండర్ -22 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్టు భారత్ ప్రకటించింది. దీనికి సంబంధించి గురువారం ఓ ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు భారత బాక్సింగ్ సమాఖ్య ప్రకటించింది. తాజా నిర్ణయంతో భారత పురుషులు, మహిళా క్రీడాకారులు ఆసియా అండర్ -22 ఛాంపియన్ షిప్ టోర్నీలకు దూరం కానున్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున టోర్నమెంట్ రీ షెడ్యూల్ చేస్తే భారత క్రీడాకారులు బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారని, లేనియెడల విత్ డ్రా అవుతామని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే ఆసియా బాక్సింగ్ సమాఖ్యతో పాటు టోర్నీ నిర్వాహక కమిటీకి లేఖ పంపినట్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్‌ పేర్కొంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం అండర్-22 బాక్సింగ్ పోటీలు జనవరి 20 నుంచి 30 వరకు జరగాల్సి ఉంది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాలు కూడా టోర్నీని వాయిదా వేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై ఆసియా బాక్సింగ్ సమాఖ్య ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.. అయితే, ఆసియా గేమ్స్ గతేడాది డిసెంబర్ 7 నుంచి 17 వరకు జరగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా జనవరి-2022కు వాయిదా వేశారు.