రూ.65 వేల కోట్లివ్వాలి: రఘురాం రాజన్

by  |
రూ.65 వేల కోట్లివ్వాలి: రఘురాం రాజన్
X

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు కేంద్రం రూ.65వేల కోట్లు ఇవ్వాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో మాట్లాడిన వీడియో సంభాషణను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది. లాక్‌డౌన్ నిరంతరంగా కొనసాగించలేమ‌నీ.. దీన్ని ఎత్తివేసేందుకు భారత్ తెలివైన వ్యూహాలు రచించాలని సూచించారు.

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కల్లోలం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావంపై రాహుల్, రాజన్ మధ్య చర్చ జరిగింది. పొడిగించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడినందున భారత్‌లో వెంటనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాజన్ తెలిపారు. పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం అత్యవసరమన్నారు. ప్రజా రవాణా సహా అన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం తప్పనిసరి అన్న విషయం గుర్తించాలన్నారు. కొవిడ్-19 పరీక్షలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో అధికార వికేంద్రీకరణ చాలా ముఖ్యమని కూడా రాజన్ సూచించారు.

30 నిమిషాల పాటు జరిగిన ఈ వీడియో సంభాషణలో రఘురాం రాజన్ రాహుల్ గాంధీని చివరగా ఓ ప్రశ్న అడిగారు. కొవిడ్ సమయాన పరిస్థితులు భారత్, అమెరికా మధ్య చూసిన తేడాలేమిటీ అని ప్రశ్న వేశారు. రాహుల్ బదులిస్తూ ‘‘సామాజిక అసమానతలు నన్ను బాధిస్తున్నాయి. భారత్‌లో సామాజిక మార్పు రావాలి. అన్నింటికీ ఒకే సమాధానం ఉండదు. గవర్నెన్స్ ముఖ్యం. ఈ కొవిడ్ 19 ఒక చారిత్రక అంశం. ప్రపంచమెప్పుడూ చూడని విపత్కాలంలో ఇప్పుడు ఉన్నాం. దీని ఎదుర్కొంటున్నాం’’ అని అన్నారు.

Tags: inc leader, rahul gandhi, raghuram rajan, rbi ex governor

Next Story

Most Viewed