ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో దూసుకెళ్తాం : రేవంత్ రెడ్డి

by  |
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పోటీ ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో మా పోరాటానికి మంచి స్ఫూర్తిని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మా ఓట్లను మేము సాధించుకోవడమే కాకుండా అదనంగా ఓట్లు సాధించి అధికార టీఆర్ఎస్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను బయట పెట్టామన్నారు.

ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు పాల్పడ్డా, అధికార దుర్వినియోగం చేసినా కూడా మా స్థానిక సంస్థల నేతలు పట్టుదలతో ఉండి చిత్తశుద్ధితో ఎన్నికల పోరాటం చేశారని తెలిపారు. ఖమ్మం రాయల నాగేశ్వర్ రావు, మెదక్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిలు గట్టిపోటీ ఇచ్చారని, ఎన్నికల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరికీ అభినందనలు తెలిపారు.

Next Story