బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో టెన్షన్ టెన్షన్.. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం..

175
ys

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. హత్యలు, కొట్లాటలతో రాజకీయ నాయకులు రౌడీలను తలపిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అది మరువక ముందే మరో సంఘటన జరిగింది. చిత్తూరు జిల్లాలోని ఆర్‌ఎస్ పురంలో దివంగత మాజీ సీఎం వైస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనితో ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్‌రెడ్డి, ఇతర వైఎస్‌ఆర్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఘటన వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే దుండగులను అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.