అనవసరంగా బయటకు రావొద్దు.. మాస్కులు ధరించండి

by  |
అనవసరంగా బయటకు రావొద్దు.. మాస్కులు ధరించండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరోనా విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. ఏపీలో ఆక్సిజన్, మందుల కొరత లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. ఇదే అదునుగా భావించి, ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో వసతులు మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతేగాకుండా.. ప్రజలు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్పుడే కరోనాను ఎదుర్కోగలం అని సూచించారు. అనవసరంగా బయటకు రావొద్దు.. మాస్కులు ధరించండి అని అన్నారు.

Next Story

Most Viewed