- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అదరహో అనంతసాగర్.. జాలువారిన జలపాతం

దిశ ప్రతినిధి, మెదక్ : రెండు కొండలపై నుండి ఎగసిపడే నీటి పరవళ్లు… మనసుకి హాయి గొల్పుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండల్లోని జలపాతాలు పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ శివారులో గుట్టల మీద ఉండే అప్పలాయ చెరువు మత్తడి దూకుతోంది.
అప్పలాయ చెరువులోకి నీరు వచ్చే క్రమంలో రెండు చెరువుల మధ్య ఉండే ఎత్తైన రాళ్లపై నుండి జాలువారే మత్తడి నీరు జలపాతాన్ని తలపిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతం వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతసాగర్ జలపాతాన్ని పర్యాటంకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మరో ప్రత్యేకత…
తెలంగాణలో ఉన్న సరస్వతి క్షేత్రాల్లో అతి ప్రముఖ సరస్వతి క్షేత్రం అనంత సాగర్‌లో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా బాసర, వర్గల్ తర్వాత అనంతసాగర్ ప్రసిద్ధి గాంచింది. అందులోను సిద్దిపేట జిల్లాలోనే రెండు సరస్వతి క్షేత్రాలు వర్గల్, అనంత సాగర్ ఉండటం విశేషం. అంతటి ప్రాధాన్యత కల్గిన అనంత సాగర్ సరస్వతి క్షేత్రం వద్ద గల అప్పలాయ చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
- Tags
- Anantha Sagar