సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో 58 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

by  |
సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో 58 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ, జగిత్యాల : జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో ఉదయం టిఫిన్ చేసిన 58 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, విద్యార్థులకు చికిత్స అందించారు. వీరిలో 19 మంది విద్యార్థులను అడ్మిట్ చేసుకొని.. మిగతా 39 మంది విద్యార్థులను చికిత్స అనంతరం హాస్టల్‌కు తరలించారు. గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు.

అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్వహించబడుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో దేనికి కూడా శాశ్వత భవనాలు ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురుకుల సొంత భవనాలపై దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులకు ఆహారం అందించేటప్పుడు సిబ్బంది టెస్ట్ చేసిన తరువాతనే విద్యార్థులకు అందించాలన్నారు. ఈ పిల్లలు దేశ భవిష్యత్ అని అన్నారు. ఈ లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు.

గురుకుల పాఠశాలలకు శాశ్వత భవన నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే పని చేస్తోందన్నారు. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, అన్ని భవనాలకు ఒకేసారి నిర్మాణం సాధ్యం కాకపోవచ్చని దశలవారీగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న నవోదయ, మోడల్ స్కూల్, కస్తూ్ర్భా పాఠశాలలకు ఎలాంటి శాశ్వత భవనాలు కల్పించారో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా
గురుకుల పాఠశాలల కోసం శాశ్వత భవనాలు నిర్మించాలని, అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవని జీవన్ రెడ్డి అన్నారు.


Next Story

Most Viewed