అక్రమ మద్యం సరఫరా.. ఏడుగురు అరెస్టు!

41

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మద్యం దుకాణాలపై విధించిన నిషేధం వలన అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఏపీలోనికి గుట్టుచప్పుడు కాకుండా మద్యం బాటిళ్లను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అక్రమ మద్యం భారీ ఎత్తున పట్టుబడుతుండటంతో ఏపీ పొలీసులు ఎక్కడి నుంచి ఈ మద్యం వస్తుందనే దానిపై ఎక్కువగా దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సరిహద్దుల్లో నిఘాను కఠినతరం చేశారు. దాంతో శుక్రవారం అక్రమంగా మద్యం తరలిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్య పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మూడు చెక్ పోస్టుల్లో కలిపి రూ.6లక్షల విలువైన వెయ్యి మద్యం బాటిళ్లతో పాటు రూ. 1,73,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిబ్బందికి ఎన్‌ఫోర్స్ మెంట్ ఎస్పీ రివార్డులు అందజేశారు.