భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్న IKEA

by  |
ikea
X

దిశ, వెబ్‌డెస్క్: స్వీడిష్ ఫర్నిచర్ దిగ్గజ సంప్థ IKEA భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టనుంది. న్యూఢిల్లీ పరిసరాల్లో రెండు కొత్త కేంద్రాలను నిర్మించనుంది. కొత్త పెట్టుబడి విలువ సుమారు రూ.7,000 కోట్లు ($ 928 మిలియన్లు). గురుగ్రామ్, నోయిడాలో కొత్త కేంద్రాలను నిర్మించడం ద్వారా రిటైల్‌లో పెట్టుబడులను పెంచుకోనుంది. దీని వలన భారత్‌లో మరింత పెట్టుబడికి అవకాశం ఏర్పడుతుంది అని IKEA భారత్ CEO పీటర్ బెట్జెల్ తెలిపారు. IKEA గృహోపకరణాల రంగంలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటి. మెుట్టమెుదటగా 2018లో భారత్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించింది. దేశంలో తన రిటైల్ వ్యాపారంలో రూ.10,000కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది.


Next Story

Most Viewed