మాస్క్ పెట్టుకోకపోతే ఆడ, మగ ఆ పని చేయాల్సిందే..!

by  |
మాస్క్ పెట్టుకోకపోతే ఆడ, మగ ఆ పని చేయాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వచ్చిన తర్వాత ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఇంటి నుంచి అడుగు బయటపెడితే మాస్క్ తప్పనిసరి చేశాయి అన్ని దేశాలు. మాస్క్ ధరించని వాళ్లకు జరిమాన విధించడంతోపాటు స్వల్ప శిక్షలు కూడా అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో సైతం మాస్క్ ధరించకుండా బయటకు వస్తే రూ.1000 ఫైన్ విధిస్తామని అధికారులు ప్రకటించింన విషయం తెలిసిందే. ఇండోనేషియాలో మాస్క్ లేని వారికి ఎలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో చూద్దాం…

ఇండోనేషియా దేశస్తులతోపాటు ఆ దేశంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనే నిబంధన విధించింది ఆ ప్రభుత్వం. మాస్క్ పెట్టుకోని వారికి జరిమానాతోపాటు శిక్షలు విధిస్తున్నారు. ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపమైన బాలిలో మాస్క్ లేని వారు 7 డాలర్ల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. డబ్బులు కట్టలేని వారికి గతంలో కొవిడ్-19తో చనిపోయిన వారి కోసం గుంతలు తవ్వించడం, పాడుబడిన ఇళ్లలో పెట్టి తాళాలు వేయడం చేశారు. తాజాగా 50 పుష్ అప్స్ చేస్తున్నారు. స్త్రీ, పురుషులు అనే భేధం లేకుండా ఈ శిక్షలను అమలు చేస్తున్నారు. ఆ దేశానికి వచ్చే టూరిస్టులకు సైతం ఇవ్వే నిబంధనలు వర్తింపజేస్తున్నారు.

Next Story

Most Viewed