బతికి బట్ట కట్టాలంటే ఢిల్లీకి రండి.. రైతుల కొత్త నినాదం

by  |
farmers protest
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆందోళనలు, నిరసనలతో దేశంతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రైతులు.. తాజాగా మరో కొత్త నినాదమిచ్చారు. ‘మీరు బతికి ఉండాలనుకుంటే ఢిల్లీకి రండి. ఉద్యమంలో పాల్గొనండి..’ (జిందా హై తో ఢిల్లీ ఆజా.. సంఘర్షో మే షామిల్ హొ) అనే నినాదం రాసి ఉన్న టీషర్టులను విడుదల చేశారు. యువతను ఈ పోరాటంలోకి పెద్ద ఎత్తున భాగస్వాములు చేయాలనుకుంటున్న రైతు సంఘాల నాయకులు.. ఆ మేరకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ సుమారు మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాటిని రద్దు చేసే దాకా పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు టిక్రా, సింఘా లలో శాశ్వత నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. నిరసన కార్యక్రమాలలో భాగంగా రైతులు ఈనెల 26న మరోసారి భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed