గుడ్ న్యూస్ చెప్పిన ICMR.. ఒమిక్రాన్‌కు సరికొత్త టెస్టింగ్ కిట్ రెడీ

by  |
గుడ్ న్యూస్ చెప్పిన ICMR.. ఒమిక్రాన్‌కు సరికొత్త టెస్టింగ్ కిట్ రెడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు భారీగా బాధితుల శాంపిల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో రిజల్ట్ రావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఐసీఎంఆర్ పరిశోధనలు నిర్వహించి సరికొత్త కిట్‌ను రూపొందించింది. ఈ కిట్ ద్వారా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చునని ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ కిట్‌ను వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన ఐసీఎంఆర్.. కిట్లను సొంతంగా అభివృద్ధి చేసుకునేందుకు తయారీదారులను ఆహ్వానించింది. తద్వారా ఈ కిట్‌లను తయారుచేసి అమ్మే హక్కును ఆయా కంపెనీలు పొందుతాయి. కానీ, ఈ కిట్‌కు సంబంధించిన పూర్తి హక్కులు ఐసీఎంఆర్‌కు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కిట్ ద్వారా ఒమిక్రాన్ బాధితులను గుర్తించడం సులువుకానుంది.



Next Story

Most Viewed