ఇండియాలో 3వ అతిపెద్ద కంపెనీ ఇదే

by  |
ఇండియాలో 3వ అతిపెద్ద కంపెనీ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం తర్వాత భారత మూడో అతిపెద్ద నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా అవతరించనున్నట్టు తెలిపింది. కంపెనీ మొత్తం వార్షిక ప్రీమియం రూ. 16,447 కోట్లుగా ఉంది. మార్కెట్ వాటా సుమారు 8.7 శాతంగా ఉంది. ఆగష్టు 21న ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ బోర్డు సమావేశంలో భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్, సంబంధిత వాటాదారులు, రుణదాతలు స్కీం అరెంజ్‌మెంట్‌గా పరిగణిస్తూ ఆమోదించారు.

ప్రస్తుతం భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌లో భారతీ ఎంటర్‌ప్రైజెస్ 51 శాతం, ఫ్రెంచ్ బీమా సంస్థ 49 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. ‘ఈ ఒప్పందం ఐసీఐసీ లాంబార్డ్ ప్రయాణంలో కీలకం. ఈ ఒప్పందం ద్వారా తమ వాటాదారుల విలువ పెరుగుతుందని తాము ఆశిస్తున్నాం. అలాగే, భారతీ ఆక్సా పాలసీదారులకు కూడా భరోసా ఇవ్వాలని భావిస్తున్నాం’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. సంస్థ పాలసీదారులకు, భాగస్వాములకు ఆటంకాలు లేని వ్యాపార కొనసాగింపు, వినియోగదారు సేవలో ఉత్తమ ప్రమాణాలను నిర్వహించే భరోసా ఇస్తున్నామని భార్గవ్ తెలిపారు.

Next Story