ఐస్ ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య.. 6 పేజీల సూసైడ్ నోట్‌

by  |
Nagireddy
X

దిశ, నేరేడుచర్ల : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నేరేడుచర్ల పట్టణానికి చెందిన ఐస్ ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు ఆయన ఆరు పేజీల లేఖ రాసి పురుగుల మందు తాగాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నేరేడుచర్ల ట్రైనింగ్ ఎస్ఐ అభిలాష్, మృతుడి భార్య కవిత వెల్లడించారు.

పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన మోర్తాల నాగిరెడ్డి (40) పదేళ్ల క్రితం నేరేడుచర్ల మండల కేంద్రానికి వచ్చి ఐస్ కంపెనీ పెట్టుకుని జీవిస్తున్నాడు. ఇన్నాళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నడుస్తుండగా.. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఐస్ కంపెనీకి భారీ నష్టం వచ్చింది. దీంతో తీవ్ర ఇర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అయినా కుటుంబం గడవని పరిస్థితి ఉండడంతో వారం రోజుల క్రితం కోదాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయన భార్య ఉపాధ్యాయురాలుగా జాయిన్ అయింది. దీంతో నేరేడుచర్ల నుంచి కోదాడకు మకాం మార్చిన నాగిరెడ్డి నేరేడుచర్లలో ఇంటిని అమ్ముందుకు తరచూ అక్కడికి వెళ్లి వస్తున్నాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నేరేడుచర్లకు వచ్చిన నాగిరెడ్డి మంగళవారం ఇంటి సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగిరెడ్డి ఆత్మహత్యకు ముందు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ట్రైనీ ఎస్ఐ తెలిపారు

లేఖలో ఏమున్నదంటే..

మృతుడి ఇంట్లో 6 పేజీల సూసైడ్ నోటు లభించింది. సూసైడ్ నోటులో తాను నీతి, నిజాయితీతో బతుకుతున్నానని పేర్కొన్నాడు. సమాజంలో నీతి, నిజాయితీగా బతకడం చాలా కష్టమని, బంధువులు, కుటుంబ సభ్యులు తనను అపార్థం చేసుకుంటున్నారని వాపోయాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నాగిరెడ్డి లేఖలో పేర్కొన్నాడు .


Next Story

Most Viewed