నో కమ్యూనికేషన్.. రమీజ్ రాజా వ్యాఖ్యలపై ఐసీసీ క్లారిటీ

73
RAMIZ

న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు రమీజ్ రాజా వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గురువారం స్పందించింది. బోర్డు సీఈవో జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. నాలుగు దేశాల టీ20 సిరీస్‌కు సంబంధించి పాక్ బోర్డు నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. భారత్, పాక్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల మధ్య టీ20 సిరీస్‌ను ప్రతీయేడు నిర్వహించాలని ఐసీసీకి ప్రతిపాదన చేస్తానని రమీజ్ రాజా మంగళవారం ప్రకటించారు. పైన చెప్పిన నాలుగు దేశాల మధ్య టీ20 సిరీస్ టోర్నీ చూడాలనుకుంటున్నట్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ నిజంగా జరిగితే తప్పకుండా లాభాలు వస్తాయని, వీటిని నాలుగు దేశాల క్రికెట్ బోర్డులకు సమంగా పంపిణీ చేయవచ్చని వెల్లడించారు.

పీసీబీ బోర్డు చీఫ్ ప్రతిపాదనకు సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేదా కమ్యూనికేషన్ జరగలేదని, అతను ఏమి ఆలోచిస్తున్నాడో సవివరంగా తెలుసుకున్నాకే ముందుకు వెళతామని ఐసీసీ సీఈవో జియోష్ అల్లార్డిస్ క్లారిటీ ఇచ్చారు.