టీ20 ప్రపంచ కప్ ఆడతాను : దినేశ్ కార్తీక్

by  |
టీ20 ప్రపంచ కప్ ఆడతాను : దినేశ్ కార్తీక్
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్‌లో కూడా తాను ఆడాలనుకుంటున్నట్లు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు టీ20లో మంచి ఫినిషర్ అవసరం ఉన్నదని.. తాను ఆ పాత్రను పోషించగలనని కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను.. మరో మూడు నాలుగు సంవత్సరాలు క్రికెట్ ఆడే సత్తా నాకు ఉన్నది. అలాంటప్పుడు రిటైర్ ఎందుకు కావాలి. గతంలో టీ20 బాగా ఆడాను. ఇప్పుడు కూడా బాగా ఆడగలను. నన్ను ఎందుకు టీ20 ఫార్మాట్‌లో పక్కన పెడుతున్నారో అర్దం కావడం లేదు.

ఇండియాకు ఇప్పుడు మంచి ఫినిషర్ అవసరం ఉంది. అలాగే నాలుగో స్థానంలో కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది’ అని దినేశ్ కార్తీక్ అన్నాడు. రిటైర్ అయిన క్రికెటర్లు మాత్రమే కామెంట్రి చెప్పాలనే రూల్ ఏమీ లేదు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ ఆటలో జట్టు తరపున ఆడని సమయంలో ఆటగాళ్లే కామెంట్రీ చెబుతుంటారు. నేను కూడా అందుకే క్రికెటర్‌గా కొనసాగుతూనే కామెంట్రీ చెప్పాలని అనుకున్నాను. ఈ బాధ్యత కూడా సక్రమంగా నెరవేర్చగలనని అనుకుంటున్నాను. శ్రీలంక పర్యటనకు నన్ను ఎంపిక చేస్తారని భావిస్తున్నట్లు కార్తీక్ చెప్పాడు.

Next Story

Most Viewed