తన పేరుపై క్లారిటీ ఇచ్చిన క్రికెటర్ రచిన్

by  |
తన పేరుపై క్లారిటీ ఇచ్చిన క్రికెటర్ రచిన్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర భారతీయ మూలాలు ఉన్న క్రికెటర్. బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి, దీపా 1990లో న్యూజీలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారి అబ్బాయే రచిన్ రవీంద్ర. అక్కడి దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేయడంతో రచిన్‌కు జాతీయ జట్టులో చోటు దక్కింది. అయితే అతడి పేరు చూసిన చాలా మంది రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్‌ల పేర్లను కలిపి పెట్టినట్లు అనిపించింది. ఇదే విషయాన్ని రచిన్‌ను అడగగా.. తన పేరును తల్లిదండ్రులు ఎందుకు అలా పెట్టారో తెలియదన్నాడు.

ఆ విషయాన్ని తాను ఎన్నడూ అడగలేదని చెప్పారు. టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అతడి వద్ద నుంచి తాను పలు విషయాలు నేర్చుకుంటానని అన్నాడు. ఇండియా అండర్ 19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా ఉన్న సమయంలో ద్రవిడ్ కివీస్ పర్యటనకు వచ్చాడని.. అప్పటి నుంచే తనకు పరిచయం ఉందని రచిన్ అన్నాడు. ఇప్పుడు మరోసారి ద్రవిడ్‌ను కలిసే అవకాశం వచ్చిందని.. అతడి నుంచి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని రచిన్ అంటున్నాడు. ద్రవిడ్‌తో కలసి ప్రయాణిస్తే తన కెరీర్‌కు మరింత ఉపయోగపడుతుందని రచిన్ ఆశిస్తున్నాడు.



Next Story

Most Viewed